Most Recent

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ కు అన్యాయం జరిగిందా..? మీరేమనుకుంటున్నారు.?

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ కు అన్యాయం జరిగిందా..? మీరేమనుకుంటున్నారు.?

బిగ్ బాస్ లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్కులు ఇస్తూ గేమ్స్ ఆడిస్తున్న బిగ్ బాస్ మధ్య మధ్యలో హౌస్ మేట్స్ చేసే పనులపై సీరియస్ అవుతున్నాడు కూడా. ఇక బిగ్ బాస్ సెవన్ లో రైతుబిడ్డ అనే ట్యాగ్ తో హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకుల సపోర్ట్ బాగానే సొంతం చేసుకున్నాడు. కానీ మనోడు ఆట అనుకున్నంత గా లేదు. మనోడు మొదటి రోజు నుంచి రతిక చుట్టూ తిరుగుతూ.. గేమ్ ఆడకుండా ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఆతర్వాత ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు అశ్విని చుట్టూ తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ప్రశాంత్ శివాజీ డైరెక్షన్ లో గేమ్ ఆడుతూవస్తున్నాడు. అలాగే శివాజీ కూడా ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ అతన్ని గెలిపిస్తూనే వచ్చాడు. దాంతో ఏకంగా మనోడు కెప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ సెవన్ లో మొదటి కెప్టెన్ గా ప్రశాంత్ నిలిచాడు.

కానీ ప్రశాంత్ కెప్టెన్సీ అంతగా లేదు. కెప్టెన్ గా ప్రశాంత్ బాధ్యతలు సరిగ్గా నివర్తించలేదు. మనోడు కెప్టెన్ అన్న విషయం మరిచిపోయి మాములు కంటెస్టెంట్ లా ఉంటున్నాడు.  మగిలిన హౌస్ మేట్స్ కూడా ప్రశాంత్ ను కెప్టెన్ గా ఫీల్ అవ్వడం లేదు.

దాంతో బిగ్ బాస్ ప్రశాంత్ పై ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయ్యారు. అసలు కెప్టెన్ కు ఉండాల్సిన భాద్యతలు ఏంటి అని ఒకొక్కరిని అడిగాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లో ఉన్నవారు కెప్టెన్ అంటే ఏంటి అంటూ ఎవరికీ తెలిసింది వాళ్లు చెప్పుకొచ్చారు. చివరిగా ప్రశాంత్ ను కూడా అడిగాడు బిగ్ బాస్. కానీ హౌస్ లో ఉన్నవారు తనను చిన్న చూపు చూస్తున్నారని. చెప్పిన మాట వినడం లేదు అని చెప్పుకొచ్చాడు. దాంతో బిగ్ బాస్ కు ఇంకా మండింది. దాంతో ప్రశాంత్ ఓ బ్యాడ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని ఓటింగ్ పెట్టాడు. అందరు చేతులు ఎత్తడంతో ప్రశాంత్ నుంచి కెప్టెన్సీ తీసేసుకున్నారు బిగ్ బాస్. కెప్టెన్ బ్యాడ్జ్ ను స్టోర్ రం లో ఉంచాలని చెప్పాడు. దాంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు కొత్త కంటెస్టెంట్ భోలే కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు ప్రశాంత్ గురువు శివాజీ కూడా ఏడ్చినంత పని చేశాడు. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ అన్యాయంగా తీసుకున్నారని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సామాన్యుడు కష్టపడి కెప్టెన్ అవ్వడం నచ్చక హౌస్ లో ఉన్న సీరియల్ బ్యాచ్ ఇలా చేస్తున్నారని అంటున్నారు కొందరు నెటిజన్స్. మరి మీరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారా..? అయితే మీ అభిప్రాయాన్ని ఓట్ ద్వారా తెలుపండి.

ఇక్కడ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCfaww9Q8C_-EaM0sXI8o-fA/community?lb=UgkxwQoixo1e1dwoMrPLWLaJ0ePzAbcL2P40

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.