Most Recent

Tollywood: కొత్త సినిమాల ముచ్చట్లు.. షూటింగ్స్‏లో బిజీ అయిన స్టార్ హీరోలు..

Tollywood: కొత్త సినిమాల ముచ్చట్లు.. షూటింగ్స్‏లో బిజీ అయిన స్టార్ హీరోలు..

చూస్తుండగానే మళ్లీ మండే వచ్చేసింది.. మరి మండే వచ్చిందంటే మనం షూటింగ్ అప్‌డేట్స్ కూడా చెప్పాలి కదా..! ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఎవరెక్కడున్నారు.. ఏ హీరో ఖాళీగా ఉన్నాడు ఆ ముచ్చట్లున్నీ మోసుకొచ్చింది మన ET. ఇంక లేట్ ఎందుకు..? పదండి ఆ షూటింగ్ అప్‌డేట్స్‌పై ఓ లుక్ వేసేద్దాం.. చాలా రోజుల తర్వాత నాగార్జున షూటింగ్ లొకేషన్‌కు వచ్చారు. ఘోస్ట్ తర్వాత ఈయన ఖాళీగానే ఉన్నారు. మధ్యలో కొన్ని కథలు అనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామిరంగా సినిమాకు సైన్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకాపేట్‌లో జరుగుతుంది. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఓ వైపు మారుతి.. మరోవైపు నాగ్ అశ్విన్‌లకి డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతానికి ఈయన కల్కి షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా శంకరపల్లిలోనే జరుగుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో 70 శాతం శంషాబాద్‌లోనే జరుగుతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ రాజేంద్రనగర్‌లో జరుగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా.. ఆ పరిసర ప్రాంతాల్లోనే బాలయ్య భగవంత్ కేసరి షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్ సైంధవ్ షూటింగ్ బీదర్ పోర్ట్‌.. నాని హాయ్ నాన్న షూటింగ్ కన్నూర్‌.. గోపిచంద్ భీమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. రవితేజ ఈగల్ తాజా షెడ్యూల్ ఫారిన్‌లో జరుగుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.