![Rashmika Mandanna: రష్మికకు లక్కీ ఛాన్స్.. ఆ అవార్డ్ రేసులో నేషనల్ క్రష్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/rashmika-mandanna-3.jpg)
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ ఫుల్ ఫాంలో ఉంది. ‘కిరిక్ పార్టీ’తో కన్నడ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ కాలంలోనే తెలుగు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ..ఇప్పుడు అక్కడ కూడా అలరించారు. ఇప్పటికే కొన్ని హిందీ సినిమాల్లో నటించిన రష్మికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రష్మికర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు రష్మిక ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. ఇప్పటికే కొన్ని పాత్రలకు ఫిలింఫేర్ (క్రిటిక్స్ అప్రిషియేషన్), సైమా అవార్డులను గెలుచుకుంది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ ఆసియా నటి విభాగంలో రష్మిక మందన్న సెప్టిమస్ అవార్డుకు ఎంపికైంది. ఈ విభాగంలో రష్మికకు గట్టి పోటీ ఉంది. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం రష్మిక గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఉత్తమ ఆసియా నటి విభాగంలో రష్మిక సహా ఎనిమిది మంది నటీమణులు పోటీలో ఉన్నారు. ఇతర ఆసియా దేశాల నటీమణులు కూడా ఈ అవార్డ్ కోసం పోటీలో ఉన్నారు. అంతేకాకుండా, ఇదే విభాగంలో ఇండియాకు చెందిన నమితా లాల్ కూడా నామినేట్ అయ్యారు. నమిత లాల్ నటిగా, నిర్మాతగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ‘బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మలయాళ స్టార్ టోవినో థామస్ ఉత్తమ ఆసియా నటుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ప్రముఖ హిందీ యూట్యూబర్ భువన్ బామ్ కూడా ఉత్తమ ఆసియా నటుడి విభాగంలో నామినేట్ కావడం గమనార్హం. మలయాళ చిత్రం ‘2018’ కూడా ఉత్తమ ఆసియా చిత్రాల జాబితాలో నామినేట్ చేయబడింది.
View this post on Instagram
ప్రస్తుతం రష్మిక చాలా సినిమాల్లో నటిస్తోంది. ఓవైపు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ‘రెయిన్‌బో’ అనే సినిమాలో నటిస్తుంది.. ధనుష్ తో కొత్త సినిమా కోసం , అలాగే నితిన్‌తో కొత్త తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.