Most Recent

Tiger Nageswara Rao: మాస్ రాజా నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

Tiger Nageswara Rao: మాస్ రాజా నయా మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. కొంతకాలంగా మాస్ రాజా నుంచి సాలిడ్ హిట్ పడటంలేదని నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమాతో ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇవ్వనున్నారు రవితేజ. టైగర్ నాగేశ్వరావు సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్ తో కనిపించనున్నారు రవితేజ. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ ప్రేక్షకులోను మెప్పించాయి. స్టువర్టుపురాని చెందిన ఓ గజదొంగ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఒక్కప్పుడు హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణు దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మూవీలో కీలక పాత్రలో ఆమె నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి త్వరలోనే ట్రైలర్ ను రిలీజే చేయనున్నారు. టైగర్ నాగేశ్వరావు సినిమా ట్రైలర్ ను క్టోబర్‌ 3న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఈ మూవీ ట్రైలర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. టైలర్ అనౌన్స్ మెంట్ తో ఓ పోస్టర్ ను రిలీజే చేశారు. ఇట్స్ టైం టూ రోర్ అంటూ రవితేజ మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రవితేజ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. టైగర్ నాగేశ్వరావు సినిమాకు వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. 1970 లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీకృష్ణనాయుడు. ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

రవితేజ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.