యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్. ఆ తర్వాత ఆది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించారు. స్విట్జర్లాండ్లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకొని యూనిట్ బయలుదేరుతున్నప్పుడు నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వి.వి.వినాయక్ ను పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. కానీ తారక్ ఆ కథను వినేందుకు ఇష్టపడలేదట. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కథ వినాలని బుజ్జి కోరుతుండటంతో.. విని నో చెప్పాలని అనుకున్నారట తారక్. కానీ వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశారట.
ఆది సినిమా సంచలన విజయాన్నిన్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి చావ్లా నటించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయి. ఇక ఈ మూవీ తర్వాత హీరోయిన్ కీర్తి ఎక్కువ సినిమాల్లో నటించలేదు.
View this post on Instagram
ఆది తర్వాత మన్మథడు సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత శ్రవణమాసంసినిమాలో నటించింది. కీర్తి చివరిగా చోరీ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కీర్తి చావ్లా సినిమాలకు దూరంగా ఉంటుంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది అంటూ కొందరు నెటిజన్లు గాలించే పనిలో ఉండటంతో ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి చావ్లా ఇప్పుడు గుర్తుపట్టలేని లుక్ లోకి మారిపోయారు. ఆమె లేటెస్ట్ పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.