స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అనుష్క. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేజ్ అందుకుంది అనుష్క. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అదరగొట్టింది అనుష్క. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంది. అలాగే చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తరవాత ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో చేస్తుంది అనుష్క. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండ విజయం సాధిస్తున్నదంటున్నారు చిత్రయూనిట్.
View this post on Instagram
ఇక ఈ సినిమా తో పాటు ఇప్పుడు మలయాళం లో సినిమా చేస్తుంది అనుష్క. కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మలయాళంలోకి అడుగు పెడుతుంది అనుష్క. తాజాగా విడుదలైన ఈ సినిమా ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
View this post on Instagram
అనుష్క్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఫాంటసీ హారర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో జయసూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 14 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రెండు పార్ట్స్ లో విడుదుల చేయనున్నారు. 2024లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.