Most Recent

Devara : ఇది ఎన్టీఆర్ స్టామినా.. భారీ ధరకు దేవర మూవీ ఓటీటీ రైట్స్

Devara : ఇది ఎన్టీఆర్ స్టామినా.. భారీ ధరకు దేవర మూవీ ఓటీటీ రైట్స్

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ అందుకున్న తారక్ . ఇప్పుడు దేవర సినిమాత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే దేవర సినిమానుంచి విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పై యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఓ భారీ ఫైట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ ఫైట్ నీటి అడుగున ఉంటుందని తెలుస్తోంది . ఇందుకోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను నిర్మించారట.. అలాగే ఈ ఫైట్ సీన్స్ కొరియోగ్రాఫ్ చేసేందుకు హాలీవుడ్ టెక్నీషన్స్ ను తీసుకొచ్చారట. అలాగే ఈ సినిమా కు అదిరిపోయే గ్రాఫిక్స్ కూడా ఉండనుందట. ఇక దేవర సినిమా కోసం జాన్వీ కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ చేసిందట. కానీ ఆటోబర్ మొదటి వారం నుంచి కంటిన్యూగా సినిమా చేయనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దేవర ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.90 కోట్లకు ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.