Most Recent

Ramcharan – Vijay Sethupathi: రామ్​ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి..! బుచ్చిబాబు పెద్ద ప్లానే..

Ramcharan – Vijay Sethupathi: రామ్​ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి..! బుచ్చిబాబు పెద్ద ప్లానే..

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్ చరణ్. ఈ మూవీ అఖండ విజయం తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. తనకు పాప పుట్టడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న చరణ్.. తిరిగి సెట్‌లో చేరారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది.

ఇది సెట్స్‌పై ఉండగానే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు చరణ్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో విజయ్ ది ముఖ్యమైన పాత్రే కాకుండా విలన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఉప్పెన’ చిత్రంలో నటించిన సేతుపతి బుచ్చిబాబుపై నమ్మకంతో చరణ్ తో సినిమాకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ సేతుపతి అంగీకరిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ సూపర్ డూపర్ ఖాయమంటున్నారు సినీ ప్రేక్షకులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.