ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బాషా బేధం లేదు. తెలుగు, తమిళ్, హిందీ , కన్నడ అనే బేధం లేకుండా అందరు దర్శకులు హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ కాంబో మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. తమిళ్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ హీరోలు విజయ్, శివ కార్తికేయన్, ధనుష్ లాంటి బడా హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా.. అలాగే తెలుగు హీరోలు కూడా తమిళ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని కూడా గతంలో తమిళ్ దర్శకుడితో సినిమా చేసిన విషయం తెలిసిందే. నాని తమిళ్ లో జెండా పై కపిరాజు అనే సినిమా చేసిన విహాయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
జండాపై కపిరాజు సినిమా తెరకెక్కించింది మరెవరో కాదు .. రీసెంట్ గా బ్రో సినిమాతో హిట్ అందుకున్న సముద్రఖని. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని హాయ్ నాని అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ సినిమా తండ్రి కూతురి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్.
View this post on Instagram
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
View this post on Instagram
దాంతో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని ఓ తమిళ్ దర్శకుడితో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. శివకార్తికేయన్ తో డాన్ సినిమా చేసిన శిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. డాన్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈయన నానితో సినిమా చేస్తున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.