చాలా మంది సినీ తారలు తమ వంటి పై ట్యాటూలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది స్టైల్ కోసం వేసుకుంటే మరికొంతమంది తమకు ఇష్టమైన వారి పేరును ట్యాటూ గా వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ట్యాటూలతో కనిపిస్తూ ఉంటారు. రష్మిక, సమంత, శ్రుతిహాసన్ లాంటి వారు తమ ఒంటి పై ట్యాటూలు వేయించుకున్నారు. అలాగే హీరోల్లో నాగ చైతన్య, అఖిల్, కళ్యాణ్ రామ్ ఇలా కొంతమంది తమ ఒంటి పై ట్యాటూ వేయించుకున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన చేతి పై ఓ ట్యాటూ వేయించుకున్నారు. అయితే ఆ ట్యాటూ ఏంటి.? దాని వెనక ఉన్న రహస్యం ఏంటి.? అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇంతకు అల్లు అర్జున్ చేతిపైన ఉన్న ట్యాటూ ఏంటంటే.?
అల్లు అర్జున్ తన స్నేహ రెడ్డి పేరునే చేతిపై టాటూగా వేయించుకున్నాడు. స్నేహ అని బన్నీ చేతి పై ఉంటుంది. బన్నీ పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం తెలిసిందే. అయన తన ఫ్యామిలీకి కావాల్సినంత టైం ఇస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా తన భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు.
View this post on Instagram
ఇక తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను మెప్పించింది.
View this post on Instagram
ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ ఊర మాస్ పాత్రలో నటించాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాని బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నాడు అల్లు అర్జున్ .
View this post on Instagram
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.