Most Recent

Mahesh Babu: మహేష్ బాబు షర్ట్ సింపుల్‌గానే ఉంది కానీ.. కాస్ట్ మాత్రం మాములుగా లేదుగా..!

Mahesh Babu: మహేష్ బాబు షర్ట్ సింపుల్‌గానే ఉంది కానీ.. కాస్ట్ మాత్రం మాములుగా లేదుగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ కు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకులను ఖుష్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో రఫ్ గా కనిపించనున్నారు.

అలాగే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్ సినిమా దాదాపు చివరి దశకు వచ్చేసిందని తెలుస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి సంక్రాంతి పండగకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో చేసే సినిమాను మొదలు పెట్టనున్నారు.Mahesh Babu Photoఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు బిగ్ సి ఈవెంట్ కు హాజరయ్యారు. ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ లుక్ అందరిని ఆకర్షించింది. బ్లాక్ కలర్ చెక్ షర్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu™ 🔔 (@mahesh_babu__fans)

చూడటాన్ని సింపుల్ గా ఉన్నా మహేష్ ధరించి షర్ట్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. మహేష్ బాబు షర్ట్ ధర అక్షరాలా  17,999 రూపాయలు. సెలబ్రెటీలు ఈ రేంజ్ లో బట్టలు ధరించడం కామనే.. మహేష్ బాబు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మహేష్ బాబు ఒకొక్క సినిమాకు దాదాపు 80 కోట్ల వరకు అందుకుంటారని టాక్. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో సంక్రాంతికి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.