Most Recent

Gadar 2, OMG 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీక్వెల్స్

Gadar 2, OMG 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీక్వెల్స్

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వెన్నెల్లు దిగివచ్చె.. బాక్సాఫీసులకు అంటూ బాలీవుడ్‌ హుషారుగా పాటలు పాడుకుంటోంది. లాస్ట్ వీక్‌ రిలీజ్‌ అయిన రెండు సినిమాల కలెక్షన్లు చూసి కడుపునిండిపోతోంది బాలీవుడ్‌కి. అందుకే పండగ చేసుకుంటున్నారు నార్త్ జనాలు. అయితే, కాసుల వర్షం కురిపిస్తున్న గదార్‌2, ఓఎంజీ2.. సినిమాలకు ఓ కామన్‌ పాయింట్ ఉంది.  సన్నీడియోల్‌, అమీషాపటేల్‌ నటించిన గదార్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది గదార్‌2. సీక్వెల్‌ లోనూ వారిద్దరే నటించడం అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం. లాస్ట్ వీక్‌ రిలీజ్‌ అయిన ఈ సినిమా 300 కోట్ల వసూళ్లకు దగ్గర్లో ఉంది. జనాలకు నచ్చే కథ, వాళ్ల పల్స్ పట్టుకోగలిగే స్క్రీన్ ప్లే ఉంటే కోట్లు కొల్లగొట్టడం కష్టమేమీ కాదని ప్రూవ్‌ చేసింది సన్నీడియోల్‌ గదార్‌2.

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

మాస్‌ జనాల పాకెట్లను కబ్జా చేస్తోంది గదార్‌2. జనాల్లోకి వెళ్లిన సినిమాలకే ఇన్నేసి వసూళ్లు తెచ్చుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

ఇప్పటికీ నార్త్ లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయంటేనే, సన్నీ మూవీ హిట్‌ రేంజ్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గదార్‌ సీక్వెల్‌కి బాక్సాఫీస్‌ దగ్గర గట్టిపోటీనిచ్చిన సినిమా ఓమైగాడ్‌2. ఆల్రెడీ ప్రేక్షకులకు బాగా నచ్చిన ఓ మైగాడ్‌ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది ఓమైగాడ్‌2.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

అక్షయ్‌కుమార్‌ నటించిన ఈ సినిమాకు కూడా యమా క్రేజ్‌ వచ్చింది. అక్షయ్‌ వంద కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే టాక్‌ కూడా వినిపించింది. అయితే అందులో నిజం లేదని, ఆయన సినిమాకు పార్ట్ నర్‌గా మాత్రం వ్యవహరించారని స్పష్టం చేశారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇప్పటికే వంద కోట్ల మార్కును క్రాస్‌ చేసేసింది ఓ మై గాడ్‌ 2. 112 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అక్షయ్‌కుమార్‌ కెరీర్‌లో హిట్‌ ఫిల్మ్ గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అక్షయ్‌కి ఈ సీక్వెల్‌ పండగ సందడి తెచ్చిపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.