
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాల్లో నటించి అభిమానులకు షాకిచ్చింది. ముఖ్యంగా ఇందులో మిల్కీ బ్యూటీ బోల్డ్ సీన్స్ చేయడంపై నెట్టింట తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చింది తమన్నా. ఇక అదే సమయంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి కూడా ఓపెన్ అయ్యింది. ఇక ఇప్పుడు తమన్నాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. తమన్నా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రానికి యాజమాని.
ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద వజ్రం ఇప్పుడు తమన్నా వద్ద ఉంది. అంతపెద్ద డైమండ్‌తో చేసిన ఉంగరాన్ని మిల్కీబ్యూటీ తన అందమైన వేళ్లకు ధరించింది. ఆ డైమండ్ సైజ్, బరువు ఎక్కువగానే ఉంటాయి. నివేదికల ఈ డైమండ్ రింగ్ ధర రూ.2 కోట్లు. ఇంత భారీ ధర ఉండటానికి కారణం.. ఆ వజ్రాన్ని ఎంతో అందంగా.. చక్కటి ఆకారంలో తయారు చేశారు. అలాగే ఉదారమైన మెరుపు.. దాని రూపం ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఉంగరాన్ని తమన్నాకు మెగా కోడలు ఉపాసన బహుమతిగా ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది మిల్కీబ్యూటి. అయితే ఈ సినిమాలో తమన్నా నటనకు మంత్రముగ్దులైన ఉపాసన.. ఆమెపై అభిమానంతో ఈ డైమండ్ రింగ్ గిఫ్ట్‌గా అందించారు. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తమన్నా నటనకు ఫిదా అయిన ఉప్సీ వరల్డ్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన డైమండ్ రింగ్ బహుమతిగా అందించారు. మిల్కీబ్యూటీ ఆ ఉంగరాన్ని ధరించిన ఫోటోను షేర్ చేస్తూ షేర్ చేస్తూ తమన్నాపై ప్రశంసలు కురిపించింది ఉపాసన.
Tamannaah
ఇక ఉపాసన ట్వీ్ట్ పై తమన్నా రియాక్ట్ అవుతూ ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక కొందరు తమన్నా పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపారు. సైరా నరసింహా రెడ్డి చిత్రంలో తమన్నాతో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, అనుష్క శెట్టి, విజయ్ సేతుపతి, నయనతార , నిహారిక కీలక పాత్రల్లో నటించగా.. కొణిదెల నిర్మాణ సంస్థపై రామ్ చరణ్ నిర్మించారు.