Most Recent

Razakar Movie: తెలంగాణ ఎన్నికల ముందు.. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ‘రజాకార్’ సినిమా పోస్టర్..

Razakar Movie: తెలంగాణ ఎన్నికల ముందు.. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ‘రజాకార్’ సినిమా పోస్టర్..

Razakar Movie: టాలీవుడ్‌లో మరో సినిమా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. రజాకార్ సినిమా పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను టార్గెట్‌ చేసే ఈ సినిమా తీశారని ముస్లిం మత పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో రజాకార్ సినిమా పోస్టర్‌పై వివాదం.. మతంతోపాటు.. రాజకీయ టర్న్ తీసుకునే అవకాశముందని ఓ వర్గం ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ‘రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదితరులు ఆవిష్కరించారు. హైదరాబాద్​సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో రజాకార్ సినిమా తీసినందుకు అభినందించారు బండి సంజయ్. నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.

అయితే, రజాకార్ సినిమాపై ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగా నరహంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1948 సమయంలో నిజాం ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత పోలీస్ యాక్షన్ లాంటి పరిస్థితిని చిత్రకరిస్తూ.. ముస్లింలే పెద్ద నేరస్తులుగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.

తుపాకీ కత్తిపై ఓ బ్రాహ్మణుడు మృతదేహం వేలాడుతున్నట్టు చూపించడం కూడా పెద్ద వివాదానికి దారి తీస్తుంది. ఆనాడు రజాకార్లు ఒక కులం అంటూ టార్గెట్ చేయలేదని.. ఎక్కువగా రెడ్లు, దళితులే బలయ్యారని ఎలక్షన్ల కోసం, వేడిలో వేడిగా డబ్బు చేసుకోవడం కోసం ఈ పాట్లు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు అటు మత పెద్దలు ఇటు ఎంబీటీ లాంటి రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాను తీస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.