![Project K: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/07/project-k-first-glimpse.jpg)
ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్- కే (వర్కింగ్ టైటిల్) ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. సినిమాలో డార్లింగ్ ఫస్ట్‌లుక్‌పై విమర్శలను తిప్పిగొట్టేలా ఈసారి అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం ఆరంభమవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ విజువల్స్ అదిరిపోయాయి. ఇక సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ, లుక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ‘వాటీజ్ ప్రాజెక్ట్- కె’ అనే డైలాగ్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఇక దీపికా పదుకొణె క్యారెక్టర్ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్‌లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్, టైటిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో రిలీజైన తొలి ఇండియన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులకెక్కింది. హీరో ప్రభాస్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి తదితరులు ఈ ఈ వెంట్లో సందడి చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ వ్యవయంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజైన గ్లింప్స్ హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.