![Deepika Padukone: సాలిడ్ యాక్షన్ కు సై అంటున్న దీపికా పదుకోన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/07/deepika.jpg)
వెండితెర మీద గ్లామర్ ఇమేజ్‌తో టాప్ చైర్‌ను ఆక్యుపై చేసిన దీపికా పదుకోన్ ఇప్పుడు రూట్ మార్చారు. గ్లామర్ యాంగిల్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నా… యాక్షన్ ఇమేజ్ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. ఆల్రెడీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చినీ బ్యూటీ… అప్‌కమింగ్ సినిమాల్లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. 2017లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీతో యాక్షన్ వైపు టర్న్ అయిన దీపికా… ఆ జానర్‌తో బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే బాలీవుడ్‌లోనూ ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్‌గా పఠాన్ సినిమాతో దీపిక కల నెరవేరింది. ఈ సినిమాలో దీపికకు సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ చేసే ఛాన్స్ దక్కింది.
పఠాన్ తరువాత జవాన్ సినిమాలో మరోసారి షారూఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు దీపిక. ఈ సినిమాలో కూడా ఈ బ్యూటీ యాక్షన్ రోల్‌లోనే కనిపించబోతున్నారు. టీజర్‌లో ఒక్క షాట్‌లోనే కనిపించిన రెయిన్ ఫైట్‌లో అమ్మడి లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. తాజాగా ప్రాజెక్ట్ కే సినిమా నుంచి దీపిక లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ లుక్ చూస్తే ఈ మూవీలో కూడా దీపికది యాక్షన్ రోలే అనిపిస్తోంది. ఇక సెట్స్ మీద ఉన్న ఫైటర్ సినిమాలోనూ దీపిక ఫైట్స్ చేయబోతున్నారు… ఈ సినిమా కోసం స్టంట్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు దీప్స్.
ఇలా వరుసగా యాక్షన్ రోల్స్ చేస్తున్నా.. గ్లామర్ ఇమేజ్‌ను కూడా పర్ఫెక్ట్‌గా కంటిన్యూ చేస్తున్నారు. యాక్షన్ సినిమాల్లోనూ అల్ట్రా గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇలా అన్ని వర్గాలను అలరించేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు దీపికా పదుకోన్.