Most Recent

BRO Twitter Review: ‘బ్రో’ ట్విట్టర్ రివ్యూ.. మామ, మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విట్టర్ రివ్యూ.. మామ, మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే..

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతం సినిమాకు తెలుగు రీమేక్‏గా వచ్చిన లేటేస్ట్ చిత్రం బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సోషియో ఫాంటసి సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇవాళ అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. బ్రో కథేంటీ ?.. మరోసారి దేవుడి పాత్రలో అలరించిన పవన్.. ఈసారి ఏమేరకు మెప్పించాడు ?.. అనే విషయాలను నెట్టింట చర్చించుకుంటున్నారు. మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటించిన ఈ సినిమా గురించి అడియన్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం.

బ్రో ఫస్ట్ హాఫ్ బాగుందని.. కామెడీ అదిరిపోయిందని.. ఇక మామ అల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌంట్ అయ్యిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యే సీన్స్ ఉన్నాయని.. కథ.. కథనం బాగుందంటూ ట్వీట్ చేస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.