Most Recent

Baby Movie: బేబీ మూవీపై నయనతార భర్త ఆసక్తికర కామెంట్స్.. చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం..

Baby Movie: బేబీ మూవీపై నయనతార భర్త ఆసక్తికర కామెంట్స్.. చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం..

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బేబీ చిత్రం బీభత్సం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ , వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ చిత్రానికి బ్రహ్మారథం పట్టారు.ఈ సినిమాలో వీరి ముగ్గురి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే బేబీ సినిమాపై అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా బేబీ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్. తన ఇన్ స్టా స్టోరీలో బేబీ చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

“ఒక కొత్త బోల్డ్ టీమ్ నుంచి వచ్చిన ఈ కొత్తతరం సినిమా క్రేజీ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఈ గ్రాండ్ సక్సెస్‏కు కుదోస్. చాలా బోల్డ్‎గా రాశారు. బ్రూటల్ గా చిత్రీకరించారు.” అంటూ డైరెక్టర్ సాయి రాజేష్, హీరో ఆనంద్ దేవరకొండను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. డైరెక్టర్ సాయి రాజేష్ విఘ్నేష్ పోస్ట్ పై స్పందించారు.

Vignesh Shivan

Vignesh Shivan

“విఘ్నేష్ సర్.. మా సినిమా మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది. నానుమ్ రౌడీ ధాన్ సినిమాకు నేను వీరాభిమానిని. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. కృతజ్ఞతలు.” అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే హీరో ఆనంద్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. థాంక్యూ సోమచ్ సర్.. మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాపై విఘ్నేష్ స్పందించడంతో.. త్వరలోనే ఈ సినిమా తమిళంలో రీమేక్ చేయబోతున్నారా ?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 71.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బేబీ చిత్రమ్. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది బేబీ టీమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.