Most Recent

Allu Arjun: కట్టేకాలేంతవరకు నేను చిరంజీవి ఫ్యాన్‌నే.. అది మారదు.. మామపై మమకారం చాటుకున్న బన్నీ

Allu Arjun: కట్టేకాలేంతవరకు నేను చిరంజీవి ఫ్యాన్‌నే.. అది మారదు.. మామపై మమకారం చాటుకున్న బన్నీ

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు అల్లు అర్జున్‌. ఈ సెన్సేషనల్‌ హిట్‌ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు బన్నీ. ఈ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్‌ నుంచి సామాజిక మాధ్యమాల్లో తరచూ ఒక వార్త వినిపిస్తుంటుంది. అదేంటంటే.. మెగాస్టార్‌ చిరంజీవి నీడ నుంచి బయటపడేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడని, చిరంజీవికి దూరంగా ఉంటూ తన ఓన్‌ బ్రాండ్‌ బిల్డ్‌ చేసుకుంటున్నాడని కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాగే మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయని ప్రచారమూ జరుగుతుంటుంది.అయితే ఇవన్నీ కేవలం రూమర్లేనని ‘బేబీ’ అప్రిషియేషన్ మీట్‌ వేదికగా నిరూపించాడీ పాన్‌ ఇండియా హీరో. కట్టేకాలేంత వరకు తాను చిరంజీవి ఫ్యాన్‌నే.. అది మారదు అంటూ మామపై ప్రేమాభిమానులు చాటుకున్నాడు బన్నీ. ‘బేబీ’ ర్మాత ఎస్‌.కె.ఎన్‌ చిరంజీవి గారికి వీరాభిమాని. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా, ఎప్పుడైనా చిరంజీవిపై కామెంట్‌ చేస్తే ఘాటుగా సమాధానం ఇచ్చేవాడు. దీనిని నోటీస్‌ చేసిన అల్లు శిరీష్‌ ఏలూరులో ఉన్న ఎస్‌.కె.ఎన్‌ను తమ దగ్గరకురమ్మని పిలిపించాడు. అలా ఆయన మా కుటుంబంలో మెంబర్‌ అయ్యాడు’ అని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న అల్లు అర్జున్ ‘కట్టే కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానినే.. అది ఎప్పటికీ మారదు’ అని చెప్పుకొచ్చాడు.

 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాభిమానులు వీటిని తెగ షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ పుష్ప.. ది రూల్‌ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బన్నీ. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్‌.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.