
Prabhas Adipurush Release Live Updates: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి అడుగుపెట్టాడు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోస్ మొదలయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది. థియేటర్ల వద్ద కేక్ కట్ చేసి, తీన్ మార్ డప్పులతో డాన్సులు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్‌లో ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. ‘సినిమా బాగుంది. ఫస్ట్ అఫ్ అద్భుతంగా వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ ,మేకింగ్ ,రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా ఉన్నారు. ఇప్పటివరకు సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నిటికీ సినిమా సమాధానం. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్’ అని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.