
సినిమా బాలేకపోతే ఎవరైనా ఏం చేస్తారు.. మా అంటే ఫీలవుతారు.. టికెట్ మనీ వేస్ట్ అంటూ ఓపెన్ గా రియలైజ్ అవుతారు. కాని అదేంటో దళపతి ఫ్యాన్స్ మాత్రం తమ రూటే సపరేట్ అనేలా ఓ దుశ్చర్య చేశారు. వీరి అరాచక అతితో నెట్టింట వైరల్ అవుతున్నారు… తిట్లు తింటున్నారు. ఇంతకీ దళపతి హార్ట్ కోర్ ఫ్యాన్స్ చేసిన దుశ్చర్య ఏంటాని థింక్ చేస్తున్నారా… మీ బుర్రలకు కూడా తట్టనంత హాని కర పని చేశారు. బీస్ట్ సినిమా నచ్చలేదని… దళపతి తమ పరువు తీశారని అరుస్తూ… థియేటర్లో ని సిల్వర్ స్క్రీన్‌కే ఏకంగా నిప్పంటించారు.