Most Recent

Bigg Boss 10: ఇప్పటికైనా మారితేనే హౌస్‌లో ఉంటావు.. షాలిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

Bigg Boss 10: ఇప్పటికైనా మారితేనే హౌస్‌లో ఉంటావు.. షాలిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

షాలిని తిరిగి హౌస్‌లోకి రావడం తనకు నచ్చలేదని రామ్ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా బయటకు వెళ్లిన కంటెస్టెంట్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడం తనకు సమంజసంగా అనిపించలేదన్నారు. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఆటలో మార్పు కనిపిస్తుందని ఆశించినా, ప్రవర్తనలో పెద్దగా మార్పు లేదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో షాలిని తిరిగి హౌస్‌లోకి వచ్చిన తర్వాత తన ఆటతీరును ఎలా నిరూపించుకుంటుందనే అంశం చర్చనీయాంశమైంది. ఎపిసోడ్‌లో అత్యంత కీలకమైన అంశం షాలినికి నాగార్జున ఇచ్చిన క్లాస్. తనను ఇతరులు ఎలిమినేట్ అయ్యి మళ్లీ వచ్చిన కంటెస్టెంట్‌గా చూస్తున్నారని, తన ఆటలో వచ్చిన మార్పును గుర్తించడం లేదని షాలిని బాధపడింది. అయితే ఆమె చెప్పిన మాటలకు, హౌస్‌లో ప్రవర్తించిన తీరుకు మధ్య తేడా ఉందని నాగార్జున వీడియోల ద్వారా వివరించారు.

గతంలో ఇతర కంటెస్టెంట్లతో గొడవపడిన సందర్భాలు, కోపంతో హద్దులు దాటిన తీరు, వ్యక్తిగత విమర్శలు చేసిన ఘటనలను చూపించారు. కోపం వచ్చినప్పుడు సంయమనం పాటించాలని, ఇతరులపైకి దూసుకెళ్లడం, దూకుడుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు నాగ్. తన ప్రవర్తనను మార్చుకుంటానని గతంలో ఇచ్చిన మాటను కూడా గుర్తుచేశారు. షాలినికి నాగార్జున చూపించిన మరో వీడియోలో రోహిత్‌తో ఆమె సన్నిహితంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇతరులు తమ వ్యక్తిగత ప్రవర్తన గురించి మాట్లాడితే అభ్యంతరం వ్యక్తం చేసిన షాలిని, నేషనల్ టెలివిజన్‌లో తాను ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా ఆలోచించుకోవాలని నాగార్జున అన్నారు. దీంతో షాలిని కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. తన తప్పులను అర్థం చేసుకుని ప్రవర్తనలో మార్పు చూపించాలని నాగార్జున సూచించారు.

నాగార్జున ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన షాలిని.. తాను ఈ ప్రజర్ తీసుకోలేకపోతున్నానని, హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. నాగార్జున ఆమె నిర్ణయాన్ని అడుగుతూ, వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని స్పష్టం చేశారు. షాలిని వెళ్లిపోతానని చెప్పడంతో రోహిత్ ఆమెను ఆపేందుకు ప్రయత్నించాడు. హౌస్‌లోనే ఉండి తన ఆటను నిరూపించుకోవాలని కోరాడు. షాలిని వెళ్లిపోతానని చెప్పడంతో నాగార్జున హౌస్ డోర్స్ తెరవాలని చెప్పారు. అయితే రోహిత్ ఆమెను వెళ్లకుండా ఆపుతూ, ఆటలో ఉండాలని నచ్చజెప్పాడు. మరోవైపు, ప్రేక్షకుల ఓట్లను గౌరవించాలనే ఉద్దేశంతో బయటకు వెళ్లాలని అనుకుంటున్నట్లు షాలిని చెప్పింది. నాగార్జున ఆమె నుంచి నిర్ణయం కోసం ఎదురుచూడగా, చివరికి తాను హౌస్‌లోనే ఉంటానని షాలిని తెలిపింది. మొత్తంగా ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున పలువురు కంటెస్టెంట్లకు ప్రశంసలు అందించడంతో పాటు, తప్పులు చేసిన వారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.