
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2. సుమారు నాలుగేళ్ల క్రితం (2022)లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన దర్శకుడు పీఎస్ మిత్రనే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు నటించారు. అలాగే విలక్షణ నటుడు ఎస్జే సూర్య విలన్ గా నటించడం విశేషం. ఇలా స్టార్ క్యాస్టింగ్ కు తోడు గ్లింప్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు సర్దార్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే హీరో కార్తీ, ఎస్జే సూర్య భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. అయితే తీరా థియేటర్లలోకి అడుగు పెట్టాక సర్దార్ 2 అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది.
తమిళంలో ఓ మాదిరి కలెక్షన్లు వచ్చినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. అయితే ఉన్నంతలో డబుల్ రోల్ లో కార్తీ నటన, ఎస్జే సూర్య విలనిజం అభిమానులను మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
సర్దార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 01 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సర్దార్ 2 సినిమా అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో సర్దార్ 2..
#Sardar2 Now Streaming on @PrimeVideoIN @Karthi_Offl @MalavikaM_@AshikaRanganath @rajishavijayan@iYogiBabu @iam_SJSuryah @Psmithran @ivyofficial2023 @SamCSmusic @george_dop @editorvijay @rajeevan69 #ursniresh @lakku76 @venkatavmedia @ivyofficial2023 @RajaS_official pic.twitter.com/7fy2Jm2MCs
— Cinema Mania (@ursniresh) October 1, 2026
ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ఎస్.లక్ష్మణ్ కుమార్ సర్దార్ 2 సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు యోగిబాబు, రజీషా విజయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి
సర్దార్ 2 సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.