
ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని ఏలిన దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఈ టాప్ దర్శకుడు. అందమైన ప్రేమ కథలకు తనదైన స్టైల్ లో కామెడీని జోడించి మంచి విజయాలను అందుకున్నారు శ్రీను వైట్ల. కాగా శ్రీను వైట్ల కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాల్లో ఆనందం సినిమా ఒకటి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాల్లో ఆనందం ముందు వరసలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఆకాష్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.. అలాగే రెండు కేంద్రాలలో 200 రోజులు ఆడింది ఈ సినిమా..
అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది
2001 అందమైన ప్రేమ కథతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఉంది. ఇక ఈ సినిమాలో మరో ప్రేమ కథను కూడా చూపించాడు శ్రీను వైట్ల. వెంకట్, తను రాయ్ ల మధ్య మంచి ఫీల్ ఉండే కథ ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించిన తను రాయ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆ సినిమాలో ఎంతో అమాయకంగా అద్భుతంగా నటించి మెప్పించింది తను రాయ్.
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!
ఈ సినిమా తర్వాత తను రాయ్ పలు సినిమాల్లో నటించింది అలాగే చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది ఈ బ్యూటీ. తమిళం , మలయాళం , బెంగాలీ, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ సినిమాలు తగ్గించింది. అప్పుడెప్పుడో ఆర్జీవీ తెరకెక్కించిన అప్పర్ రాజు సినిమాలో కనిపించింది. ఆతర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. సోషల్ మీడియాలోనూ తను రాయ్ పెద్దగా యాక్టివ్ గా లేదు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడా లేవు. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది అని నెటిజెన్స్ ఆరాతీస్తున్నారు.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.