Most Recent

సినిమా ఇండస్ట్రీ వల్ల చాలా కోల్పోయా..! అందుకే ఎక్కువ మూవీస్ చేయలేదు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీ వల్ల చాలా కోల్పోయా..! అందుకే ఎక్కువ మూవీస్ చేయలేదు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ముట్టుకుంటే మాసిపోతుందేమో.. కంటి చూపు పడితే కందిపోతుందేమో అనేలా ఉండే భామ.. గ్లామర్ ఒలకబోయడంలోనూ ముందుంటుంది ఈ అందాల తార.. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా కానీ.. ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రెండు పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆ తర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది భామలు కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి మెప్పించినా కూడా ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు కొందరు. చాలా మంది పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఇంకొంతమంది ఆఫర్స్ లేక సతమతం అవుతున్నారు. ఇక అలాంటి వారిలో ఈ భామ ఒకరు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

ఆమె ఎవరో కాదు తక్కువ సినిమాలతో కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయిపొయింది ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్. తెలుగులో ఈ భామ ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత కరెంట్, సింహలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ.. నేను 16ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చా.. అప్పుడే 10th క్లాస్ అయిపోయి కాలేజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నా.. అప్పుడే నాకు బాలీవుడ్ లో లక్కీ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా టైంలో నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు… మా అమ్మకు క్యాన్సర్. అప్పుడు ఈ సినిమా ఛాన్స్ నాకు కాస్త రిలాక్స్ ఇచ్చింది. అలాగే చాలా సహాయపడింది. మా అమ్మకు ట్రావెలింగ్ అంటే ఇష్టం దాంతో సినిమా షూటింగ్స్ కు అమ్మను తీసుకెళ్లొచ్చు అనుకున్నా.. సినిమా మంచి హిట్ అయ్యింది. నాకు క్రేజ్ వచ్చింది.. అయితే ఇండస్ట్రీకి నాకు చాలా ఇచ్చింది.. అంతకంటే ఎక్కువే తీసుకుంది. నా కాలేజ్ డేస్ మొత్తాన్ని కోల్పోయా.. నా టీనేజ్ మొత్తం పోయింది. చిన్నప్పటి నుంచే నాకు చాలా ఆఫర్లు చవ్చాయి. యాడ్స్ లో నటించమని చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఇంట్లోవాళ్లు కూడా ఇండస్ట్రీ అసభ్యకరంగా ఉంటుందని భయపెట్టారు. పైగా నేను అంతగా గ్లామర్ గా ఉంటానని నేను అనుకోలేదు. అందుకే నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మంచి పాత్రలు వస్తే చేద్దాం అనుకుంటున్నా.. తిరిగి బిజీ అవ్వాలని చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది స్నేహ ఉల్లాల్.

 

View this post on Instagram

 

A post shared by Sneha Ullal (@snehaullal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.