Most Recent

OTT Movie: మెడికల్ కాలేజీలో అంతుచిక్కని మరణాలు.. ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: మెడికల్ కాలేజీలో అంతుచిక్కని మరణాలు.. ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్

సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు మూడు లేదా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఐదు లేదా ఆరువారాలకు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి కొన్ని సినిమాలు రెండు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అయితే తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో డిఫరెంట్‌ శబ్దాలు, బీజీఎమ్ తో అందరినీ భయపెట్టారు. అలాగే ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించని సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మున్నార్‌లోని ఒక మెడికల్ కళాశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ కాలేజీలో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అంతేకాదు మృతదేహాలపై చిత్ర విచిత్రమైన మార్కులు కనిపిస్తుంటాయి. దీంతో కాలేజీలో ఏదో ఉందని అందరూ అనుమానిస్తారు. అప్పుడే ఈ మిస్టరీని కనిపెట్టేందుకు రూబాన్ అనే ఒక ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్ ను కాలేజీకి పిలిపిస్తారు. అతను కొన్ని సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి ఆత్మలను ట్రాక్ చేస్తాడు. అదే సమయంలో కాలేజీలో విద్యార్థుల మరణాల వెనక కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ఒక వింత శబ్దం వల్లనే స్టూడెంట్స్ చనిపోతున్నారని అర్థం చేసుకుంటాడు.

ఇదే క్రమంలో కాలేజీ గత చరిత్ర గురించి తెలుసుకునే క్రమంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి.. 20 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో ఒక మ్యూజిక్ టీచర్ అనుమానాస్పదంగా చనిపోయిందని రుబాన్ తెలుసుకుంటారు. ఆమె మరణం వెనక కాలేజీ స్టాఫ్ ఉంటారని తెలుసుకుంటాడు. మరి రూబాన్ ఆ మ్యూజిక టీచర్ ఆత్మను ఎలా అడ్డుకున్నాడు? విద్యార్థుల వరుస మరణాలను ఎలా ఆపగలిగాడు? అసలు ఆ మ్యూజిక్ టీచర కథేంటి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు శబ్దం. టైటిల్ కు తగ్గట్టుగానే ‘సౌండ్’ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, లైలా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు కూడా ఈ సినిమాలో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం తమిళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రావొచ్చు.

జీ5లో శబ్ధం సినిమా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.