Most Recent

Tollywood: ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాడితో డేటింగ్..

Tollywood: ప్రియుడిని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాడితో డేటింగ్..

సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీల జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎన్నో సినిమాల్లో నటించి తమదైన నటనతో మెప్పించిన సినీతారల వ్యక్తిగత జీవితాల గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల ప్రేమ, డేటింగ్ విషయం గురించి చెప్పక్కర్లేదు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడిని పరిచయం చేసింది. 49 ఏళ్ల వయసులో మరోసారి తన ప్రేమికుడి గురించి ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. తను మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని సినిమాలో కనిపించింది. అలాగే తెలుగులో మరికొన్ని సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటించిన అమీషా .. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే గదర్ 2 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే అమీషా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. ఇప్పటికే నలుగురు పెళ్లైన హీరోలతో ఆమె పేరు ముడిపడి ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అమీషా. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా తన ప్రేమను బయటపెడుతూ.. వ్యాపారవేత్త నిర్వాన్ బిర్లాతో ఒక ప్రైవేట్ ఫోటోను పోస్ట్ చేసింది. “నా డార్లింగ్‌తో శుభ సాయంత్రం…” అంటూ తన ప్రియుడితో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఇద్దరు నల్లటి దుస్తులు ధరించి సంతోషంగా కనిపించారు. దీంతో అమీషా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

నిర్వాణ బిర్లా ఎవరు?
నిర్వాణ ఒక వ్యవస్థాపకుడు, సింగర్. అతను బిర్లా బ్రెనియాక్స్, బిర్లా ఓపెన్ మైండ్స్ వ్యవస్థాపకుడు. ప్రముఖ వ్యాపారవేత్త నిర్వాణ యశోవర్ధన్ బిర్లా, అవంతి బిర్లాల కుమారుడు. ఇప్పటివరకు అమీషా పటేల్ పేరు 4 పెళ్లయిన పురుషులతో ముడిపడి ఉంది. దర్శకుడు విక్రమ్‌భట్‌తో నటి అనుబంధం మరింత కలర్‌ఫుల్‌గా మారింది. వారు సుమారు 5 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. కానీ మనస్పర్థలతో వీరిద్దరు విడిపోయారు. అతడిని ప్రేమించడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని గతంలో షాకింగ్ కామెంట్స్ చేసింది అమీషా.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.