Most Recent

Puri Musings: పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..

Puri Musings: పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..

ఆనందం.. దీనికి సరైన అర్థం ఎవరూ చెప్పలేరు. కానీ ప్రతీ మనిషి ఇందుకోసమే జీవిస్తాడు. ఆనందంగా జీవించడమే మనిషి అంతిమ లక్ష్యంగా చెబుతుంటారు. అయితే నిజమైన ఆనందం అసలు ఎక్కడ ఉంటుంది. దీనికి సంబంధించే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఒక మంచి కథ ద్వారా చెప్పాడు. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో పలు అంశాలపై స్పందించే ఈ దర్శకుడు తాజాగా ‘అన్ హ్యాపీనెస్‌’ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ఇంతకీ పూరి చెప్పిన ఆ కాకి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక కాకి చెట్టుపై కూర్చుని తెగ ఏడుస్తూ ఉంటుంది. దీంతో అదే సమయంలో చెట్టి కింద ఉన్న సాధువు అది గమనించి. ఎందుకు ఏడుస్తున్నావు అని కాకిని అడుగుతాడు. అప్పుడు కాకి బదులిస్తూ.. ‘నేను నల్లగా ఉండటం వల్ల ఎవరు నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు, నేను వెళ్లి ఏ ఇంటి మీద వాలినా కట్టెతో కొట్టి తరిమేస్తున్నారు. నల్లగా ఉన్న నన్ను ఎవరు ఇష్టపడటం లేదు’ అంటూ కాకి తన కష్టాన్ని చెప్పుకొస్తుంది. దీంతో వెంటనే సాధువు స్పందిస్తూ.. పక్కనే ఉన్న హంస దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉందో లేదో కనుక్కో అని చెప్తాడు.

దీంతో హంస వద్దకు వెళ్లి ఇదే ప్రశ్న అడగ్గా.. ‘నాది ఒక అందమేనా, తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను, నా జీవితం మొత్తం ఈ కొలనులోనే తిరుగుతూ బతకాలి. ఆ చిలుక చూడు ఎంత అందంగా, స్వేచ్చగా ఉందో అంటూ చిలుక వైపు చూపిస్తుంది. దీంతో చిలుక దగ్గరకు వెళ్లిన కాకి.. నువ్వు చాలా అందంగా ఉంటావు, మరి సంతోషంగా ఉన్నావా అంటూ కాకి ప్రశ్నించింది. అప్పుడు చిలుక మాట్లాడుతూ నేను అందంగా పుట్టడమే శాపం, ఈ జనాలు నన్ను పంజరంలో పెట్టి చిత్రవధ పెడుతున్నారు. అక్కడ నుంచి ఎగిరి పోవాలని ఎంత ప్రయత్నించినా నేను ఎగరలేను. జీవితాంతం నేను అందులోనే ఉండాల్సిందే. నా కంటే ఆ నెమలి ఎంతో బెటర్ అని చెబుతుంది.

నెమలి దగ్గరకు వెళ్లి అడగ్గానే.. నన్ను ఈ జూలో నన్ను తీసుకు వచ్చి పడేశారు. వచ్చి నాతో ఫోటోలు దిగుతూ పురి విప్పమని విసిగిస్తూ ఉంటారు. సమయం సందర్భం లేకుండా ఎలా పురి విప్పుతాము. నీ జీవితమే సూపర్‌, నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు, నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు అంటూ కాకితో నెమలి చెప్పింది. పక్కవాడిని చూసినప్పుడు వాడు మనతో పోల్చితే చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ వాడికి ఉండే కష్టాలు వాడికి ఉంటాయి. కనుక ఎదుటి వాడు ఏదో సంతోషంగా, సుఖంగా మనకంటే ఆనందంగా ఉన్నాడని మనం ఏడవడం అవివేకం అనే మెసేజ్‌ను పూరి బాగా చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.