మోహన్ లాల్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. వందల సినిమాల్లో నటించి వేల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. ఇక కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అతడే ప్రణవ్ మోహన్ లాల్. సినీరంగంలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా సంచలనాలు సృష్టించాడు. అయితే పాన్ ఇండియా స్టార్ హీరోగా మారతాడనుకున్న ప్రణవ్.. ఇప్పుడు రోజూ కూలీగా మారాడు. గొర్రెల కాపరిగా మారి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కోట్ల ఆస్తిని, సినీరంగాన్ని వదిలేసి సామాన్యుడిగా జీవిస్తున్నాడు. ప్రణవ్ గురించి చెప్పాలంటే.. తండ్రి స్టార్ హీరో కావడంతో.. బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా మారాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. కొన్నాళ్లకు హీరోగా మెరిశాడు. హృదయం సినిమాతో రికార్డ్స్ సృష్టించాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత వర్షంగళ్కు శేషం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రణవ్. ఓవైపు నటన.. మరోవైపు దర్శకత్వం, రైటర్ గా అన్ని విభాగాల్లోనూ మంచి పట్టు సాధించాడు. అయితే ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రణవ్.. ఇప్పుడు సినీరంగానికి దూరంగా ఉంటున్నాడు. ప్రణవ్‌కి నటన కంటే ట్రావెలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. హీరోగా నటించడం ప్రారంభించిన 7 ఏళ్లలో కేవలం 5 సినిమాల్లోనే నటించాడు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఏదో ఒక ఊరికి వెళ్లడం ఆయనకు అలవాటు. అనుభవం కోసం అలా చేస్తాడు. ఇటీవల స్పెయిన్ వెళ్లిన ప్రణవ్.. అక్కడ కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకు జీతం తీసుకోవడం లేదు. కానీ భోజనం, షెల్టర్ ఇస్తారట. ఈ విషయాన్ని ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
“కష్టమైన పనిచేయడం ప్రణవ్ కు ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ప్రణవ్ ఏడాదికి రెండు సినిమాలు చేయాలనేది నా కోరిక. అయితే ప్రణవ్ కూడా ప్రతి రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తానని చెప్పాడు” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.