రేణుకాస్వామి హత్యకేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతన్న నటుడికి ఆరు వారాల పాటు బెయిల్ మంజూరవ్వడంతో ఇటీవలే అతనిని జైలు నుంచి విడుదల చేశారు. అయితే మధ్యంతర బెయిల్ వచ్చాక దర్శన్ కు వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. మధ్యంతర బెయిల్‌పై పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీని తరువాత, ఇప్పుడు దర్శన్, అతని అభిమానులపై బెంగళూరులో కొత్త ఫిర్యాదు దాఖలైంది. తాజాగా బిగ్ బాస్ నుంచి వైదొలిగిన న్యాయవాది జగదీష్ హీరో దర్శన్ పై ఫిర్యాదు చేశారు. ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకువచ్చిన లాయర్ జగదీష్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. కొన్ని రియాలిటీ షోలలో పాల్గొన్న జగదీష్, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అలాగే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నటుడు దర్శన్ కేసుపై న్యాయవాది జగదీష్ కూడా మాట్లాడారు.
దర్శన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని జగదీష్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు చాలా మంది దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో జగదీష్‌పై అనుచిత పోస్ట్‌లను పంచుకున్నారు. కొందరు దర్శన్ ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై న్యాయవాది జగదీష్, దర్శన్ తో పాటు అతని అభిమానులపై ఫిర్యాదు చేశారు.
దర్శన్ పై ఫిర్యాదు చేసిన న్యాయవాది జగదీష్..
View this post on Instagram
దీనిపై కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన న్యాయవాది జగదీష్, ‘దర్శన్‌తో నేను ఏకవచనంతో మాట్లాడానని దర్శన్ అభిమానులు నన్ను బెదిరించారు. దర్శన్ అభిమానులు కొందరు నాకు రెండు రోజుల్లో వెయ్యికి పైగా కాల్స్ చేశారు. దర్శన్ అభిమాని రిషి అతనికి చాలాసార్లు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా దీని వెనక దర్శన్ ఉన్నాడంటూ జగదీష్ ఫిర్యాదు చేశాడు. దర్శన్‌కి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారి నుండి నాకు మరియు నా కుటుంబానికి రక్షణ అవసరం. మాకు రక్షణ కల్పించడంతో పాటు దర్శన్, రిషిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది జగదీష్ ఫిర్యాదులో కోరారు.
నాకు రక్షణ కల్పించండి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి