బిగ్ బాస్ సీజన్ 8లోకి కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. హౌస్ మొత్తం సందడి సందడిగా మారింది. అంతకు ముందు హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో ఎనిమిది మందిని వదిలారు. దాంతో మొత్తం హౌస్ లో 16మంది ఉన్నారు. రాగానే పాత టీమ్ కు కొత్త టీమ్ కు మధ్య పోటీ పెట్టేశాడు బిగ్ బాస్. కొత్తగా వచ్చిన టీమ్.. ఇప్పటివరకు హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరిద్దరిని సరైన రీజన్ చెప్పి నామినేట్ చేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. దాంతో నామినేషన్స్ హంగామా మొదలైంది.
మొదటిగా హరితేజ యాష్మీ ని నామినేట్ చేసింది. నామినేషన్ బోర్డ్ మెడలో వేసి .. హౌస్ లో నువ్వు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని హరితేజ యష్మీతో అంది. ప్రతివారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా పెట్టుకున్నట్లు ఉంది.. రివెంజ్ నామినేషన్స్ కరెక్ట్ కాదు. నన్ను హార్ట్ చేసావ్ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని ప్రతిసారి చెప్పడం కరెక్ట్ కాదు. బోర్ కొట్టేస్తుంది. అలాగే ఇంటి నుంచి ఫుడ్ వచ్చినప్పుడు మణికంఠకు ఇచ్చి ఉంటే బాగుండేది. మీకు ఇష్టమైన వాళ్లవి ఎమోషన్స్ మిగిలిన వాళ్లవి కాదు అనేటట్టుగా ఉంది అని పెద్ద క్లాసే తీసుకుంది.
దానికి మణికంఠ ఏడిస్తే నేను కూడా ఓదారుస్తా అని ఎదో చెప్పాడని ట్రై చేసింది యష్మి. నేను స్ట్రాటజీ అనేది గేమ్‌లో మాత్రమే వాడతా.. మిగిలిన చోట నాకు ఏమనిపిస్తే అది చేస్తా.. అది మీకు రాంగ్‌గా కనిపించిందేమో.. నేను ప్రతివారం నామినేట్ చేస్తా అని చెప్పాను.. కానీ నేను చేయలేదు. మణికంఠ మాతో ఎంత గొడవ చేసినా వాడు ఏడ్వగానే ప్రతి ఒక్కరూ ఓదారుస్తాం.. అంటూ యష్మీ చెప్పింది. మణికంఠ కంటే నిఖిల్ కే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అందుకే నిఖిల్ కు ఫుడ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది యష్మి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.