బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ నిన్న రాత్రి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ప్రతి ఒక్కరూ నామినేషన్ కు అర్హులే అని.. ఇంటి సభ్యులు అందరిలోనుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ హరితేజ, ప్రేరణ డిసైడ్ చేస్తారని చెప్పాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాట్ ను పట్టుకోవాల్సి ఉంటుందని.. ముందుగా రెండు ప్లాట్ ఫామ్స్ మీదకు వచ్చిన ఇద్దరు సభ్యులకు ఇంటికి అవసరం లేని ఒక సభ్యుడిని నామినేట్ చేసే అవకాశం లభిస్తుందని.. కిల్లర్ గర్ల్ ఎవరిని నామినేట్ చేయాలి.. ఎవరి ఫోటో అన్ వాంటేడ్ బోర్డ్ నుంచి నామినేట్ బోర్డ్ మీదకి వెళ్లాలి అని.. అలాగే కిల్లర్ గర్ల్స్ ఎవరైతే ఎక్కువసార్లు హ్యాట్ పట్టుకుంటారో వాళ్లు ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా వచ్చిన రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్ ను నామినేట్ చేసింది. అవినాష్ చేసిన కామెడీ తనకు నచ్చలేదని.. బుల్లీయింగ్ లా ఉందని గౌతమ్ చెప్పడంతో అవినాష్ మధ్యలోకి వచ్చి రెచ్చిపోయాడు.
కామెడీ నచ్చకపోతే షోకు రావొద్దు.. డబ్బులు తీసుకొవద్దు అంటూ రెచ్చిపోయాడు అవినాష్. నాకు పర్సనల్ హర్ట్ అయి మైక్ పడేశా అది ఒప్పుకుంటాను.. ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం తప్పు కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు క్రియేట్ చేసుకున్నదే నీకు నచ్చలేదంటే మేము ఏం చేస్తాం అని రోహణి అనగా.. నేను క్రియేట్ చేసుకున్నదే అయితే బాధపడే హక్కు కూడా లేదా అంటే ఏమనాలి… నా దృష్టిలో 10 రెట్లు ఎక్కువ తప్పు.. నేను హర్ట్ చేయలే .. కానీ నాకు బాధేసింది అని అన్నాడు గౌతమ్. ఇక అవినాష్ మాట్లాడుతూ.. బుల్లియింగ్ అనే టాపిక్ నిన్న నాగార్జున సార్ దగ్గర ఎందుకు తీయలేదు.. ఇప్పుడు తీస్తున్నావ్.. 12 ఏళ్లుగా కామెడీ చేస్తున్నాను.. ఎవరినీ కించపరచలేదు అంటూ ఫైర్ అయ్యాడు అవినాష్. నిన్నటి నామినేషన్స్ లో అవినాష్, రోహిణి, గౌతమ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. చివరకు గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత టాస్కులలో యాక్టివ్ గా లేడని తేజను నామినేట్ చేశాడు నిఖిల్.
ముందుగా హ్యాట్ అందుకున్న ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్ ను నామినేట్ చేసింది. నాతో మాట్లాడట్లేదు.. హోటల్ టాస్కులో పెద్దగా ఆడలేదు, సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ. ఇద్దరి పాయింట్స్ విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు పృథ్వీ. ప్రతిసారి ఆమెను హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. ఇక అతడికి సపోర్ట్ చేస్తూ నయని వస్తూ ప్రేరణ నామినేట్ కావడమే తనకూ కావాలని అన్నది. పృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూసిన తనకు అన్యాయం జరిగిందంటూ వాదించాడు పృథ్వీ. దీంతో ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. యష్మి తేజ పేరు చెప్పగా.. మణికంఠ నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ నిఖిల్ ను నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ పేరు చెప్పాడు అవినాష్.. అలాగే టాస్కులు సరిగ్గా ఆడట్లేదు అంటూ విష్ణు పేరు చెప్పాడు గౌతమ్. హ్యాట్ పట్టుకున్న హరితేజ మణిని నామినేట్ చేసింది. పృథ్వీ ప్రవర్తన కరెక్ట్ కాదంటూ యష్మి చెప్పుకొచ్చింది. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు కూడా జరగనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.