ఎప్పుడూ కంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు కంగనా రనౌత్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా అమె స్పందించే స్టైల్ వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు. తాజాగా జయాబచ్చన్ పేరు వివాదంపై రియాక్ట్ అయ్యారు కంగన రనౌత్. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్.. తన పేరు విషయంలో అసహనాన్ని వ్యక్తం చేశారు. జయా అమితాబ్ బచ్చన్ అంటూ చైర్మెన్ ధన్‌కడ్ పిలవడాన్ని జయా తప్పుపటారు. కేవలం తనను జయా బచ్చన్ అని పిలుస్తే సరిపోతుందన్నారు. అయితే దీనిపై తాజాగా రియాక్ట్ అవుతూ… జయాబచ్చన్ స్పందించిన తీరును ఆమె తప్పు బట్టారు. పేరు విషయంలో ఆ రకమైన అహంకార వైఖరి ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ సమస్యలు ఎదురవుతాయని హితువు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు. ఇది చాలా దారుణమైన విషయమని, స్త్రీ, పురుషుల మధ్య అందమైన బేధాన్ని ప్రకృతినే సృష్టించిందని తెలిపారు. అయితే దానిని కూడా కొందరు వివక్షగా చూస్తున్నారని, స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుందన్నారు కంగనా.
మన పేరు వెనక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినంతనే కొంతమంది కోపానికి గురవుతున్నారని, తీవ్ర అసహనంకి లోనవుతున్నారని… మరో వ్యక్తి పేరును చేర్చినంతమాత్రానికే తమ గుర్తింపుపోతుందని ఆందోళన చెందుతున్నారని, అలాంటి వ్యక్తులను చూసినప్పుడు బాధగా ఉంటుందని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు కంగనా. మరోవైపు ఆమె స్వీయదర్శకత్వంలో నటించిన ఎమర్జెన్సీ మూవీ..వివాదాలకు కేరాఫ్‌గా మారింది. మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ఓ వర్గం హెచ్చరిస్తుంటే.. కంగనా మాత్రం తగ్గేదే లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.