2018లో వచ్చి ధడక్ సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయమైన జాన్వీ కపూర్.. ఇన్నేళ్ల తర్వాత తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వచ్చినా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. తల్లి శ్రీదేవీకి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పుడు జాన్వీ తెలుగు ఎంట్రీపై అందరి దృష్టి పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసిందీ బ్యూటీ. ఆదివారం జరగాల్సిన దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసింది. బ్లూ కలర్ శారీలో చూడ ముచ్చటగా ఉన్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో జాన్వీ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా’ అంటూచెప్పొచ్చింది.
జాన్వీ తెలుగులో మాట్లాడిన వీడియో..
View this post on Instagram
ఇక తనను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతానని చెప్పుకొచ్చిన జాన్వీ… శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నాకు చాలా సహాయపడిన చిత్రబృందానికి థ్యాంక్స్’ అని చెప్పుకొచింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..