బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈసారి నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది మంది ఉన్నారు. నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. అయితే యష్మీకి ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. పెద్ద క్లేన్‌కి చీఫ్ కావడంతో యష్మీకి నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే నామినేషన్స్ లో లేని వారిని కూడా డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మీ. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేసే సమయంలో ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగా ఎంజాయ్ చేయాలేము.. గేమ్ సరిగ్గా ఆడలేం అని చెత్త రీజన్ చెప్పి విష్ణు ప్రియను నామినేట్ చేసింది యష్మీ.
నామినేషన్స్ అయిపోయిన తర్వాత నిఖిల్ గురించి పృథ్వీతో మాట్లాడుతూ కనిపించింది సోనియా. నామినేషన్స్ లో నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు. దానికి సరైన రీజన్ కూడా చెప్పలేకపోయాడు. దీని గురించి సోనియా పృథ్వీతో మాట్లాడింది. వాడికి అసలు ఎలాంటి పాయింట్స్ లేవురా.. అందుకే అభయ్, నబీల్‌ను నామినేట్ చేద్దామనుకున్నాడు. కానీ అప్పటికే అభయ్‌ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆదిత్య నామినేట్ చేశాడు కదా.. నువ్వు అయితే అర్థం చేసుకుంటావని నీకు వేసిండు.. అంటూ నిఖిల్ సైడ్ మాట్లాడింది సోనియా. దానికి వాడు ఎందుకు వీక్ అవుతున్నాడు అని పృథ్వీ అంటే.. ఇంకొక ఒన్ వీక్ చూద్దాం వాడిని.. డెవలప్ అయితే ఓకే లేకపోతే లైట్ తీసుకోవడమే ఇంకేం చేస్తాం.. అని సోనియా అంది.
ఆతర్వాత ఉదయం మణికంఠతో డిస్కషన్ పెట్టింది సోనియా. ఎవడైనా నన్ను రెచ్చగొడితే నేను ఎలా తీసుకుంటాను.. ఎలా రియాక్ట్ అవుతాను అనేది చూపించడానికే విష్ణుప్రియతో నేను అలా మాట్లాడా.. అలా ఉంటేనే రెండోసారి మన జోలికి రారు.. నేను కూడా నా ఫ్యామిలీని మిస్ అయ్యి ఇక్కడికి వచ్చాను.. నాకు ఓ అన్న కావాలి, ఓ తమ్ముడు కావాలి అని సోనియా అనగానే.. మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. ఏడుపు మొఖం పెట్టి “నీకు విష్ణుప్రియకి డిస్కషన్ వస్తున్నప్పుడు నేను జడ్జ్ చేయలేకపోయా ఎందుకంటే నాకు నీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. అక్క అంటే నువ్వు ఒక్క దానివే నాకు.. సరేనా.. నాకు ఎక్కడైనా నెగెటివ్ ఆలోచన వచ్చిందంటే క్లియర్ చేసుకోవడం నా హ్యాబిట్ అంతే.. అనగానే మణికంఠకు ఓ హగ్ ఇచ్చింది సోనియా. ఆతర్వాత పృథ్వీ దగ్గరకు వెళ్లి వాడు మాట్లాడడా నీతో.. అదే పెద్దోడు.. వాడు పెద్దోడు.. నువ్వు చిన్నోడు అని సోనియా అంటే.. దానికి పృథ్వీ..మాట్లాడాడు.. ఫ్లిప్ అయ్యా బ్రో.. పాయింట్సే దొరకడం లేదు ఆ టైమ్‌లో అందుకే నీకు వేశా నామినేషన్.. సారీ అని చెప్పాడు.. అని అన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.