Most Recent

Aadujeevitham: ఆ ఉద్దేశంతో సినిమా తీయలేదు.. ఆడు జీవితం వివాదం పై స్పందించిన దర్శకుడు..

Aadujeevitham: ఆ ఉద్దేశంతో సినిమా తీయలేదు.. ఆడు జీవితం వివాదం పై స్పందించిన దర్శకుడు..

నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఆడుజీవితం’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేశాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కాలం కష్టపడ్డాడు. అయితే ఈ సినిమా పై చాలా వివాదాలు కూడా వచ్చాయి. దీని పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఏ వ్యక్తిని, జాతిని, దేశాన్ని, విశ్వాసాలను కించపరిచే ఉద్దేశంతో తీయలేదని దర్శకుడు ప్లెసీ అన్నారు. ఆడు జీవితం సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. పని నిమిత్తం నజీబ్ అనే వ్యక్తి అరబ్ దేశానికి వెళ్తాడు. అక్కడ గొర్రెలను కాపేందుకు అతన్ని నియమిస్తారు. అయితే అతన్ని యజమాని మోసంచేస్తాడు. 700 మేకలతో ఎడారిలో ఒంటరిగా జీవిస్తాడు నజీబ్. ఒకానొక సమయంలో అతని పరిస్థితి మానసికంగా, శారీరకంగా క్షీణిస్తుంది, అతను తనను తాను గొర్రెగా భావించుకుంటాడు. ఈ కష్టకాలంలో నజీబ్ ఎలా బయటపడ్డాడనే వాస్తవ కథను బెన్యామిన్ ఆడు జీవితం అనే నవలగా రాశారు, దాని ఆధారంగా ప్లెసీ ఆడు జీవితం చిత్రానికి తెరకెక్కించాడు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

నజీబ్ పాత్రలో నటుడు పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. ఆయన భార్యగా అమలా పాల్ నటించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్-ఇండియన్ చిత్రంగా విడుదలైంది. థియేటర్లలో విడుదలైన తొలిరోజే ఈ చిత్రానికి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది.  పృథ్వీరాజ్‌కి ఈ సినిమా తప్పకుండా జాతీయ అవార్డును తెచ్చి పెడతుందని ప్రేక్షకులు భావించారు. ఆ మేరకు తెరపై ఆ పాత్రలో జీవించాడు.

ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

పాన్-ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది. 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. దర్శకుడు ప్లెసీకి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర అవార్డు ప్రకటించారు.  OTTలో సినిమా విడుదలైన తర్వాత అరబ్బులను క్రూరమైన, కనికరం లేనివారిగా చిత్రీకరించినందుకు సౌదీ అరేబియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే సౌదీలో సినిమాపై నిషేధం విధించారు. అదే సమయంలో, సినిమా చివర్లో నజీబ్‌ను రక్షించే ధనవంతుడైన అరబ్ పాత్రలో నటించిన జోర్డానియన్ నటుడు అకేబ్ నజన్. సినిమా కథను సరిగ్గా చదవనందుకు సౌదీ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పుడు దర్శకుడు ఈ సినిమా పై తలెత్తిన వివాదానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.