Most Recent

Sai Pallavi: ‘తండేల్’ షూటింగ్ సెట్‏లో సాయిపల్లవి.. సముద్ర తీరాన సత్య చూపు సుర్యోదయం వైపు..

Sai Pallavi: ‘తండేల్’ షూటింగ్ సెట్‏లో సాయిపల్లవి.. సముద్ర తీరాన సత్య చూపు సుర్యోదయం వైపు..

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యూక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అక్కినేని నాగచైతన్య. చివరిసారిగా కస్టడీ సినిమాలో కనిపించారు యువసామ్రాట్. ఇక ఇటీవలే ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసింది. క్రైమ్ థ్రిల్లర్ నేఫథ్యంలో వచ్చిన ఈ సిరీస్ లో చైతూ జర్నలిస్ట్ పాత్రలు కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మత్స్యకారుల జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. వీరిద్దరి జంటగా నటిస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జోడికి స్పెషల్ ఫాలోయింగ్ సైతం ఏర్పడింది.

ఇప్పుడు మరోసారి ఈ జోడి అడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి చైతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చైతూ మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. నిజ జీవితం సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఉడిపిలో స్టార్ట్ అయ్యింది. ఈఱోజు నిన్నటితో అక్కడ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

తాజాగా ఈ సినిమా నుంచి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో సాయి పల్లవి ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తూ.. సముద్ర తీరాన ఒంటరిగా సూర్యోదయాన్ని ఆస్వాదిస్తుంది. దీంతో ఈ బ్యూటీ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే … ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ గోకర్లలో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లోనే సాయి పల్లవి జాయిన్ అయ్యింది. ఇక్కడే ఆమెపై మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తూ వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం సాయి పల్లవి శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడుతుందట. ఇందుకోసం శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.