టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డే అభిమానులు సందడి చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజున విదేశాలకు వెళ్లాలని చూస్తుంటారు. పూజా హెగ్డే తన పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లింది. ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటో పోస్ట్ చేసింది. బీచ్ దగ్గర హాయిగా నిద్రపోతూ ఫోటోను షేర్ చేస్తుంది. ఈ ఫోటోకు ‘ప్రస్తుతం అందుబాటులో లేను’ అని రాసుకొచ్చింది. దీనిపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు కామెంట్ బాక్స్‌లో పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూజా హెగ్డేకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పూజాహెగ్డేకు 2.45 కోట్ల మంది ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానుల కోసం 1,489 పోస్ట్‌లు చేసింది పూజా. రీసెంట్ గా పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అలాగే పూజా అంగీకరించిన సినిమాల నుంచి బయటకు వచ్చింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారు. కానీ ఆతర్వాత ఈ సినిమానుంచి బయటకు వచ్చింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంచి కూడా పూజాహెగ్డే తప్పుకుంది. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. పూజా హెగ్డే పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాలని అభిమానులు కోరుకుంటుంది. మరి పూజా కొత్త సినిమా అనౌన్స్ చేస్తుందోమో చూడాలి.
View this post on Instagram
పూజా హెగ్డే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..