Most Recent

SIIMA 2023: సైమా అవార్డ్స్ 2023.. ఉత్తమ సినిమాగా ‘సీతారామం’.. శ్రీలీల, మృణాల్ జోరు..

SIIMA 2023: సైమా అవార్డ్స్ 2023.. ఉత్తమ సినిమాగా ‘సీతారామం’.. శ్రీలీల, మృణాల్ జోరు..

ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయిన సినిమాలు.. ఉత్తమ నటన కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు గౌరవంగా ఈ అవార్డ్స్ ఇస్తుంటారు. తాజాగా ఈ అవార్డ్స్ వేడుక 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 15న మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డ్స్ వేడుక పుర్తయ్యింది. ఇక ఈరోజు (సెప్టెంబర్ 16న) తమిళ్, మలయాళం ఇండస్ట్రీలోని సినిమాలు జరుగుతాయి. ఈవేడుకలలో ఆర్ఆర్ఆర్ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు ఎన్టీఆర్. అలాగే ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డ్ సొంతం చేసుకుంది.

ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, అడివి శేష్, దుల్కర్ సల్మాన్, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్ చరణ్ పోటీ పడ్డారు. ఇందులో తారక్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఇక ఉత్తమ నటి కేటగిరిలో మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి, సమంత, నిత్యామీనన్, నేహాశెట్టి, శ్రీలీల పోటీ పడగా.. ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది శ్రీలీల. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అవార్డ్ అందుకోగా.. బెస్ట్ సింగర్ గా రామ్ మిర్యాల (డీజే టిల్లు చిత్రానికి) అవార్డ్ అందుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by SIIMA (@siimawards)

SIIMA 2023 అవార్డ్స్ విజేతల వివరాలు..

  • ఉత్తమ చిత్రం: సీతారామం
  • ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
  • ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
  • ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
  • ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)
  • ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
  • సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
  • ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు సాంగ్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
  • ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (జింతక్ సాంగ్)
  • ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
  • ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్)
  • ప్రామిసింగ్ న్యూకమ్ యాక్టర్: బెల్లంకొండ గణేష్‌

 

View this post on Instagram

 

A post shared by SIIMA (@siimawards)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.