గోపీచంద్ రామబాణానికి ఓటీటీ మోక్షం కలిగింది. సుమారు 4 నెలల తర్వాత ఈ మాస్ యాక్షన్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో మెప్పించారు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన రామబాణం తీర థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. రోటీన్ కథ కావడంతో ఆడియెన్స్ పెదవి విరిచారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. అయితే గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ని మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని రామబాణం త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని భావించారు చాలామంది. అయితే నాలుగు నెలల వరకు ఆ ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ కొనుగోలు చేసింది. గురువారం (సెప్టెంబర్ 14) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తానికి 4 నెలల తర్వాత రామబాణం ఓటీటీలోకి రావడంతో గోపీచంద్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ మూవీలో నాసర్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడ్కర్, సత్య, అలీ, రాజా రవీంద్ర, సప్తగిరి, గెటప్ శీను, శుభలేఖ సుధాకర్ కీ రోల్స్ పోషించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. రామబాణం సినిమాకు భూపతి రాజా కథ అందించగా, మధు సూదన్ డైలాగులు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెట్రీ పళని స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మరి థియేటర్లలో రామబాణం సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
4 నెలల తర్వాత మోక్షం..
Two siblings, who despite their difference in ideologies come together to fight for their common goal.#Ramabanam Now Streaming On Netflix
Telugu | Tamil | Kannada | Malayalam pic.twitter.com/jCSC2ZiHKW
— Cinema World (@cinemaa_world) September 14, 2023
ఇక గోపిచంద్ తర్వాతి సినిమాల విషయానికి వస్తే.. భీమా అనే మూవీలో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు హర్ష ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన భీమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై సినిమాను ఆసక్తిని పెంచింది. చాలా రోజుల తర్వాత గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
కొత్త దర్శకుడికి ఛాన్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.