పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఏపీ ఎలక్షన్స్ కొసం పవన్ కళ్యాణ్ అవుతున్నాడు.. అలాగే కోసం సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే రీసెంట్ గా సముద్రఖని దర్శకత్వలో బ్రో సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు పవన్. ఈ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను లైనప్ చేశారు పవన్ కళ్యాణ్. వాటిలో ముందుకుగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహరవీరమల్లు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సీమ ఎప్పుడో మొదలనప్పటికి ఇప్పటివరకు ముందుకు కదలలేదు. కొంతం భాగం షూటింట్ తర్వాత ఈ మూవీని పక్కన పెట్టారు పవన్. కానీ ఈ సినిమా షూటింగ్ మెల్లగా జరుగుతుందని టాక్. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.
అలాగే సాహో దర్శకడు సుజిత్ తో కలిసి ఓజీ అనే సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకానుకగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన చిన్న వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఈ వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో చూపించారు సుజిత్.
అలాగే గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఏఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓమరో దర్శకుడికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తుంది. ఆయనే సురేందర్ రెడ్డి. రీసెంట్ గా ఈయన ఏజెంట్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు. అయితే సైరా సినిమా దగ్గర నుంచే పవన్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారట సురేంద్ర రెడ్డి. ఇప్పుడు ఆయన పవన్ కు కథ చెప్పి ఓకే చేపించుకున్నారని టాక్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..