రితిక పెంకేషం..! అమర్ బూతు పురాణం..! దామిని ఏడుపు యవ్వారం..! గౌతమ్ కృష్ణ వీరావేశం! మధ్యలో శివాజీ చిలిపి తనం.. ! ఇలాగే.. వీళ్ల గోలతోనే.. కాస్త ఇంట్రెస్టింగ్‌గా.. మరి కాస్త ఇరిటేటెడ్‌గా సాగింది బిగ్ బాస్ సీజన్ 7 11thడే 12th ఎపిసోడ్. మరి ఇవ్వాళ్టి.. 12thడే 13thఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. చదివేయండి
ఇక నిన్నటి పవరాస్త్రను పొందే టాస్క్ ఇవ్వాళ కూడా కంటిన్యూ అయింది. మహాబలి టీంలో ఉన్న గౌతమ్ కృష్ణ రణధీర్ టీంలోని యావర్ దగ్గర నుంచి మాయాస్త్రాన్ని తీసుకుని.. శివాజీకి ఇస్తాడు. శివాజీని ఎన్నుకోవడం టీం డెసీషన్ అని.. శివాజీ మైండ్ గేమ్.. బాగుందని.. రీజన్‌గా చెబుతాడు. దీంతో యావర్ నాన్ సెన్స్ రీజన్ అంటూ.. గౌతమ్ పై సీరియస్ అవుతాడు. బిగ్ బాస్ తనతో మాట్లాడే వరకు తాను తన దగ్గర ఉన్న అస్త్రాన్ని ఇవ్వను అంటూ.. మొండికేసి కూర్చున్నాడు. అయితే అమర్ యావర్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగానే.. ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. బ్యాడ్ గేం.. అంటూ.. తన చేతిలో ఉన్న అస్త్రాన్ని విసిరేస్తాడు. ‘బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ ‘ నేను ఉండాలనుకోవడం లేదు అంటూ.. ఏడుస్తాడు. ఇంతలో బిగ్ బాస్ టాస్క్ ముగిసిందని.. పవరాస్త్రను పొందేందుకు మాయాస్త్ర భాగాలున్న శివాజీ, షకీలా.. ఫైనల్ టాస్క్ ఆడాల్సి ఉంటుందిని అనౌన్స్ చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్ ఉన్న విన్న యావర్ .. మరింతగా డిస్సపాయింట్ అయి.. తన చేతిలో ఉన్న పిల్లో విసిరేస్తాడు. ఐ వాంట్ టూ గో హోమ్ అంటూ.. లాగ్‌లో తిరుగుతూనే ఉంటాడు.
ఇక మరో పక్క రతిక మళ్లీ.. లొల్లి మొదలెట్టేస్తుంది. ప్రిన్స్, శివాజీ ఫైనల్ గేమ్‌లో ఉండాలనుకున్నా.. బలంగా కోరుకున్నా.. కానీ అలా కాకుండా.. షకీలా ఫైనల్ టాస్క్లో ఉంది. ప్రిన్స్ యావర్ కంటే షకీలా ఎలా డిస్వర్ అవుతుంది. అంటూ.. తన గొంతును పెద్దది చేస్తూ అరుస్తుంది. జెన్యూన్ గా ఆడాలి.. రాజకీయాలొద్దంటూ.. కంటెస్టెంట్స్ కు చెబుతుంది. కానీ రతిక మాటలకు అడ్డుపడిన రైతు బిడ్డ ప్రశాంత్ రతికతో మాటల దాడికి దిగుతాడు. రతిక మాటలన్నీ అబద్దాలు అంటూ.. గేమ్ అయిపోయాక చెప్పుడు కాదు… ముందు చెప్పాలని అరుస్తాడు. “వాళ్ల ముందు నువ్వు మంచిదానివి మేం లంగలమా” అంటూ.. ఆపు నీ కథలు అంటూ.. కామెంట్స్ చేస్తాడు.
ఇక వీళ్ల డిస్కషన్స్ జరుగుతుంటే.. మరో పక్క ప్రిన్స్ ఒక్క సారిగా సీరియస్ అవుతాడు. చెవులకు చిల్లులు పడేలా.. అరుస్తూ.. గౌతమ్ మీదకి వెళతాడు. గౌతమ్ కూడా గట్టిగానే రియాక్టవుతాడు. ఆల్మోస్ట్ ఇద్దరూ కొట్టుకుంటారా అనేంత దగ్గరగా నిలబడి ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. ఇక ఈ క్రమంలోనే గౌతమ్ తన చేతి వేళ్లతో ఓ సైన్ చూపించాడని.. తనను పర్సనల్‌గా ఇన్‌సల్ట్ చేశాడని.. ఐ వాజ్ జెస్టిస్ అంటూ.. గౌతమ్ మీద ఆరోపణలు చేస్తాడు. బిగ్ బాస్ ఈ ఇష్యూను సాల్వ్ చేసే వరకు.. తనకు న్యాయం చేసేవరకు.. మైకు వేసుకోను అంటూ.. మైక్ తీసేస్తాడు. అలా.. ఒక్కసారిగా బిగ్ బాస్ హీటెక్కేలా చేస్తాడు.