బిగ్ బాస్ గేమ్ షోలో వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున సందడి చేస్తారు. హౌస్ మేట్స్ గురించి. వాళ్ళ ఆటతీరు గురించి ప్రస్తావిస్తూ అవసరమైతే క్లాస్ కూడా తీసుకుంటారు. ఇక శనివారం ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. జవాన్ సాంగ్ తో స్టేజ్ పైకి వచ్చిన నాగ్ కంటెస్టెంట్స్ తో ఆట తీరు గురించి మాట్లాడారు. హౌస్ లో నాకు 13 మంది మాత్రమే కనిపిస్తున్నారు అని తెలిపాడు. కిరణ్ రాథోడ్ ను ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నావ్ తెలుగు మాట్లాడటలేదు అని అన్నారు. అలాగే అంతకు ముందు హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే చేష్టలను చూశారు. రాతిక, రైతుబిడ్డ ప్రశాంత్ లవ్ ట్రాక్ మళ్లీ మొదలైంది. రతిక అన్నం తింటుంటే ప్రశాంత్ వచ్చి నాకు కూడా పెట్టావా అని అడగటం.. చేతిలో పెడతా అంటే కాదు నోట్లో పెట్టు అని ప్రశాంత్ అడుక్కోవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.
ఆమె చాలా తెలివిగా చేతిలో ముద్దలు పెట్టి అక్కడి నుంచి జారుకుంది. ఆతర్వాత సోఫాలో కూర్చొని తన పేరు రాసుకొని లవ్ సింబల్ వేసి నవ్వుకున్నటు కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రతిక ఏంటి నీపేరే రాసి దానికి ముద్దులు పెడుతూ నవ్వుకుంటున్నావ్ అని అని అడిగింది. మరి నీకు ముద్దులు పెట్టనా..? అని అడిగాడు. కానీ ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా న నాగార్జున చూస్తూ ఉండిపోయాడు.
ఆతర్వాత శుభశ్రీ రాయగురు, ప్రిన్స్ యావర్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఇక హౌస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడిన నాగార్జున శివాజీ, షకీలా బాగా ఆడుతున్నారని అన్నారు. అలాగే మిస్టర్ యూజ్ లెస్.. లే అని నాగార్జున అనగానే శుభశ్రీ లేచి నిలుచుంది. దాంతో ఆమె పై నాగ్ పంచ్ వేశాడు. నీకు నువ్వే యూజ్ లెస్ అనుకుంటున్నావా అన్నాడు నాగ్. ప్రిన్స్ యావర్ ను యూజ్ లెస్ అని ఎందుకు అన్నావ్ అని క్లాస్ తీసుకున్నారు నాగ్. నేను కూడా నిన్ను యూజ్ లెస్ అనే అంటా.. ఎందుకో తెలుసా.. హౌస్ లోకి వచ్చి ఇన్ని రోజులైంది తెలుగులో మాట్లాడవా.? అని ప్రశ్నించారు. దానికి నాకు తెలుగు రాదు సార్ అని చెప్పాడు. ఇప్పుడు మాట్లాడావ్ కదా.. అలాగే మాట్లాడు అని అన్నారు నాగార్జున.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.