బిగ్ బాస్ సీజన్ సెవన్ లో తమ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న భామల్లో రతిక ఒకరు. పలు సినిమాల్లో ఈ అమ్మడు నటించి మెప్పించింది. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు. రతిక బిగ్ బాస్ హౌస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక రతిక బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన రతిక తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పింది. అయితే ఆమె లవర్ ఎవరు..? అని అందరు ఆరా తీసుతున్నారు. అయితే రతిక లవర్స్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున నీ లవర్ గురించి చెప్పు అని అడగ్గా ఇప్పుడు పాట పాడాలా అంటూ షాక్ ఇచ్చింది. అంటే తన లవర్ ఓ సింగర్ అని హింట్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ రతికను ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడగ్గానే కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది.
అవును నా పేరెంట్స్ తర్వాత నేని మిస్ అయ్యేది అతడినే అని తెలిపింది. ఇక బిగ్ బాస్ మీరు చాల పాటలు వినిపించారు మీకోసం ఓ పాటను నేను వినిపిస్తాను అని అన్నరు. దాంతో నా కోసం ఏమైనా పాట పాడిండా ..? అని అడిగింది. ఇంతలో ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి’ పిల్లా.. పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళా అనే సాంగ్ ను ప్లే చేశారు.
గతంలో బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. దాంతో రతిక బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అని అర్ధమవుతుంది. చాలా మంది రతిక మాజీ లవర్ రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్స్ పాడక ముందు రాహుల్ ప్రయివేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ సమయంలో రతికతో పరిచయం ఏర్పడిందని..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత పునర్నవితో రాహుల్ లవ్ ట్రాక్ నడిపాడు. దాంతో రతిక రాహుల్ మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రతిక రాహుల్ సిప్లిగంజ్ కలిసున్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.