-
బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లక ముందు ఈ అమ్మడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
-
ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది దివి. ఇక బిగ్ బాస్ లో తనదైన ఆటతో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది దివి. ఈ అమ్మడు తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది.
-
బిగ్ బాస్ 4లో ఈ అమ్మడు ఆట తీరు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి పలు సినిమాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో దివి చిన్న పాత్రలో నటించింది.
-
ఆతర్వాత ఈ అమ్మడు ఒకటి రెండు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కనిపించి మెప్పించింది. ఆ ఆల్బమ్ సోషల్ మీడియాలో మంచి వ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిన్నది తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలతో సందడి చేస్తుంది.
-
తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. పల్లెటూరి పడుచులా ఫోటోలకు ఫోజులిచ్చింది దివి. ఈ ఫొటోల్లో దివి అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.