డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఆదా శర్మ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. అయితే అందం, అభినయంతో మెప్పించిన ఆదాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ తెలుగులో ఊహించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆదా శర్మ.. ఇటీవల ది కేరళ స్టోరీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. కేరళలో జరిగిన అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ నెట్టింట వైరలవుతుంది. ఈ క్రమంలోనే ఆదా శర్మకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అపార్ట్మెంట్ ఆదా శర్మ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎంఎస్ ధోని సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్న సుశాంత్.. ఊహించని పరిణామాలతో ముంబయి బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆ ఇంటిని ఇప్పుడు ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బీటౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా నెట్టింట వినిపిస్తోన్న ఈ వార్తలపై ఎట్టకేలకు ఆదాశర్మ మౌనం వీడారు.
View this post on Instagram
శనివారం మీడియా ముందుకు వచ్చిన ఆదా శర్మ సుశాంత్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. తాను ఏదైన కొన్న..లేదంటే ఏదైనా పనిచేసిన ముందుగా మీడియాతో పంచుకుంటానని అన్నారు. దీంతో సుశాంత్ ప్లాట్ కొనుగోలుపై వచ్చిన వార్తలకు చెక్ పడింది. ముంబాయి బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఉన్న సుశాంత్ అపార్ట్మెంట్ ను ఆయన మరణం తర్వాత అద్దెకు తీసుకోవడానికి ఎవరు ఆసక్తిచూపలేదుని వార్తలు వినిపించాయి.
View this post on Instagram
కానీ ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపించారని.. కానీ ఆ ఇంటి యజమాని దానిని అద్దెకు ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారని అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తెలిపారు. సుశాంత్ సింగ్ ఉన్న అపార్ట్మెంట్ కు నెలకు రూ.5 లక్షల వరకు అద్దె చెల్లించేవారని తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.