Most Recent

Krithi Shetty: ఉపపన బయట అదషట ఆ సనమతనన మరతద..?

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ అదృష్టం ఆ సినిమాతోనైనా మారుతుందా..?

కృతి శెట్టి ఈ అమ్మడు బెబమ్మ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా ఉప్పెన తో ఒక్కసారిగా టాలీవుడ్ పై ఎగసి పడింది. ఉప్పెన సినిమాలో కాలేజీ గర్ల్ గా క్యూట్ నెస్ తో కట్టిపడేసింది ఈ చిన్నది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు ఈ చిన్నదానికి ఇక తిరుగుండదు అనుకున్నారు అందరూ.. అనుకున్నట్టే ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. నాని నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. అలాగే ఈ మూవీలో నానితో లిప్ లాక్ పెట్టి హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.

ఆతర్వాత అమ్మడి అదృష్టం అడ్డం తిరిగింది. వరుసగా సినిమాలు బోల్తాకొట్టాయి. హ్యాట్రిక్ హిట్స్ తో పాటు.. హ్యాట్రిక్ ఫ్లాప్స్ కూడా అందుకుంది. అంతే కాదు చివరిగా వచ్చిన నాగ్ చైతన్య కస్టడీ సినిమా కూడా నిరాశపరిచింది. భారీ అంచలన మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయింది.

మొన్నామధ్య తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపించింది . సూర్య, బాల కాంబినేషన్ లో వాక్కుతున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మలయాళంలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. మలయాళంలో టోవినో థామస్ సరసన చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కృతి. మరి ఈ అమ్మడి అదృష్టం మలయాళంలో ఎలా ఉందో చూడాలి .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.